స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక ఇప్పట్లో లేనట్లే!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత చేసిన రాజీనామా ఆమో దం పొందడం అన్ని వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు లేకపోవడంతో ప్రస్తుతం ఉప ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేకుండాపోయింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకెళ్తోంది. అయితే పరిషత్ ఎన్నికలకు మాత్రం బీసీ రిజర్వేషన్ల అంశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ వ్యవహారం కోర్టులో ఉండడంతో ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.
సస్పెన్షన్ దాకా..
నిజామాబాద్ నుంచి 2014లో ఎంపీగా గెలుపొందిన కవిత 2019లో ఓడిపోయారు. ఆ తరువాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023లో బీఆర్‌ఎస్ అధికారాన్ని కోల్పోయాక కవిత జిల్లాకు రావడం తగ్గిస్తూ వచ్చారు. లిక్కర్ కేసులో అరెస్టు అయి ఢిల్లీలో తీహార్ జైలుకు వెళ్లారు. తరువాత కవిత కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు లీక్ అయినప్పటి నుంచి పార్టీలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఆ తరువాత వివిధ పరిణా మాల అనంతరం కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఇదిలా ఉండగా పంచాయతీ ఎన్నికల్లో జాగృతి తరపున కొందరు పోటీచేయగా నలుగురు సర్పంచ్‌లు గెలుపొందారు.
ఏకగ్రీవంగా ఎన్నికై ..
2014లో ఎంపీగా గెలుపొందిన కవిత.. 2019లో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత 2020 జనవరిలో జరిగిన ఉప ఎన్నిక ద్వారా కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పటివర కు ఈ స్థానంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ భూపతిరెడ్డి అనర్హతకు గురయ్యారు. 2022 జనవరిలో నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో కవిత మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే 2028 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ.. బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన కవిత గతేడాది సె ప్టెంబర్ 3న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా రు. 4 నెలల తరువాత తాజాగా శాసనమండలి చైర్మన్ ఆమె రాజీనామాను ఆమోదించారు.
కవిత రాజీనామా ఆమోదంపై
ఉమ్మడి జిల్లాలో చర్చ
పరిషత్, మున్సిపల్ ప్రజాప్రతినిధులు
లేకపోవడమే కారణం
పరిషత్ ఎన్నికలపై రిజర్వేషన్ అంశం నేపథ్యంలో ప్రతిష్టంభన


