ప్రభుత్వ భూములను కాపాడాలి
నిజామాబాద్ రూరల్: ప్రభుత్వ భూములను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడు సయ్యద్ ఖైసర్ కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నగరంలోని హైమదీ బజార్‌లో ఉన్న 1500 గజాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని వారిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, బొబ్బిలి రామకృష్ణకు వినతిపత్రాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ నరేందర్ సింగ్, నాయకులు తదితరులు ఉన్నారు.


