ప్రిన్సిపాల్ రాంబాబుకు సన్మానం
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా గోపిశెట్టి రాంబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ రాంబాబును అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్, పరీక్షల నియంత్రణ అధికారి సంపత్ కుమార్, యూజీసీ డైరెక్టర్ ఆంజనేయులు, ఆర్ట్స్ డీన్ లావణ్య, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ అపర్ణ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆరతి, అరుణ, వివిధ విభాగాల అధ్యాపకులు భ్రమరాంబిక, వాణి, నందిని, శాంతాబాయి, కై సర్ మహమ్మద్, అతిక్ సుల్తా న్ ఘోరీ, మహమ్మద్ అబ్దుల్ ఖవి, జమీల్ అహ్మద్, సాయిలు, మూస ఖురేషి తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సీనియర్ మెజీషియన్ జాదు రంగనాథ్‌ను జాదుగర్ మ్యాజిక్ షో సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రఖ్యాత మెజీషియన్, గోల్డ్ మెడలిస్ట్ జాదుగర్ మార్త రవీంద్ర మ్యాజిక్ షో లలో భాగంగా బుధవారం ప్రదర్శనలు జరిగాయి. ప్రదర్శనలో సీనియర్ మెజీషియన్ జాదు రంగనాథ్ దంపతులను సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ తిరునగరి శ్రీహరి, మెజీషియన్లు చందన శ్రీనివాస్, నందిపేట రాజు, జగిత్యాల చారి, మిమిక్రీ శంకర్, ట్రస్మా అరుణ్, ప్రముఖులు పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లి: మండలంలోని చింతలూర్ గ్రామ సర్పంచ్ నాగుల శ్రీనివాస్‌తో పాటు గ్రామస్తులు బుధవారం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని సన్మానించారు. చింతలూర్ గ్రామానికి రామడుగు కుడి కాలువా ద్వారా తూము మంజూరు చేసి పూర్తి చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఉపసర్పంచ్ బాలకృష్ణ, నాగుల గోపి, చిన్నారెడ్డి, రాజేశ్వర్, వీడీసీ సభ్యులు శ్రీనివాస్, బాలయ్య, గణపతి తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ: మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ఆర్ రవీందర్‌రావును సర్పల్లి తండా సర్పంచ్ చందర్‌నాయక్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. భూసమస్యలపై తహసీల్దార్‌తో చర్చించారు. అనంతరం తహసీల్దార్‌ను సన్మానించారు. సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు చందర్‌నాయక్, ఉపసర్పంచ్ పిట్ల కళ్యాణ్ ఉన్నారు.
ప్రిన్సిపాల్ రాంబాబుకు సన్మానం
ప్రిన్సిపాల్ రాంబాబుకు సన్మానం
ప్రిన్సిపాల్ రాంబాబుకు సన్మానం


