సర్పంచుల ఫోరం డిచ్‌పల్లి మండల అధ్యక్షుడిగా వాసు
డిచ్‌పల్లి: సర్పంచుల ఫోరం డిచ్‌పల్లి మండల అధ్యక్షుడిగా ధర్మారం(బి) గ్రామ సర్పంచ్ గొట్టిపాటి వాసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌జీ గార్డెన్స్‌లో మండలంలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు సమావేశమయ్యారు. సర్పంచుల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గొట్టిపాటి వాసు, ఉపాధ్యక్షులుగా నీల బలరాం, మహమ్మద్ యూసుఫ్, ప్రధాన కార్యదర్శులుగా తోట భాస్కర్, టీ ప్రభాకర్, కార్యదర్శిగా కోట్ల భాస్కర్, కోశాధికారిగా వీ సురేశ్, మీడియా ఇన్‌చార్జిగా యాదగిరి, ప్రత్యేక సలహాదారుగా దేవీసింగ్, సలహాదారులుగా శాంతిలాల్, రుత్విజ రత్నం, సవిత, నర్సయ్య ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న కమిటీ సభ్యులను సర్పంచులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. సర్పంచుల సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం అందుబాటులో ఉంటానని వాసు తెలిపారు.


