అంగన్‌వాడీ పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ
డిచ్‌పల్లి: మండలంలోని నడిపల్లి మేజర్ గ్రామపంచాయతీలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ పిల్లలకు ప్రభుత్వం సరఫరా చేసిన యూనిఫామ్స్‌ను సర్పంచ్ కులచారి అశ్విని పంపిణీ చేశారు. జీపీ కార్యదర్శి గంగాధర్, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్ భాగ్య, ఆయా విజయలక్ష్మి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే సాంపల్లి తండా, మేలయ తండా, గుడి తండాలో ఉన్న అంగన్‌వాడీ పిల్లలకు సర్పంచ్ రాథోడ్ మమత యూనిఫామ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాదావత్ హరిచంద్, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు రాథోడ్ శశిరేఖ, బదావత్ కవిత, రాథోడ్ స్వరూప, సునీత, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.
భగవాన్ నాయక్ తండాలో..
ధర్పల్లి: మండలంలోని భగవాన్ నాయక్ తండాలోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు సర్పంచ్ సరస్వతి రమేశ్ ప్రభుత్వం సరఫరా చేసిన యూనిఫాంలను బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్ నాయక్, జీపీ సెక్రెటరీ గంగాధర్, అంగన్‌వాడీ టీచర్ శశికళ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


