పెండింగ్ జీతాలను విడుదల చేయాలి
సుభాష్‌నగర్: జిల్లాలో 104లో విధులు నిర్వర్తిస్తున్న తమకు ఏప్రిల్, 2025 నుంచి జీతాలు అందడం లేదని, వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని 104 ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఎంఅండ్‌హెచ్‌వో రాజశ్రీకి 104 ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 104లో 18 ఏళ్లుగా అంకితభావంతో సేవలు అందిస్తున్నామని తెలిపారు. 9 నెలలుగా వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. గతంలోనూ పలుమార్లు విజ్ఞప్తులు చేసినా.. ఎలాంటి పరిష్కారం లభించలేదన్నారు. పెండింగ్ జీతాలు విడుదలయ్యే వరకూ విధులను బహిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సమస్య పరిష్కారమయ్యాక వెంటనే విధులకు హాజరై ముందులాగే పూర్తి నిబద్ధతతో సేవలందిస్తామని అన్నారు. కార్యక్రమంలో బాలకృష్ణ, అరుణ్‌గౌడ్, స్వామి, కృష్ణ, శ్రీనివాస్, ఇనాయత్ అలీ, సోని, సురేశ్, సుమలత, విజయలక్ష్మి, శృతి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


