ఆధునిక పద్ధతులపై అవగాహన
సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామంలోని రైతువేదికలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరి సాగులో ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. తడి–పొడి విధానం ద్వారా యాజమాన్యం, నేరుగా వరి విత్తడం, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం వంటి పద్ధతులను కంపెనీ ప్రతినిధులు వివరించారు. నూతన సాగు పద్ధతులను అనుసరించడం వలన పెట్టుబడి తగ్గడమే కాకుండా కూలీల ఖర్చు సుమారు ఎనిమిది వేల రుపాయల వరకు ఆదా అవుతుందని తెలిపారు. సాగు సమయం కూడా తగ్గుతుందన్నారు. నీటి వినియోగాన్ని నియంత్రించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, చీడపీడల నివారణ సులభతరం అవుతుందని తెలిపారు. ఏఈవో శివాని, ఫౌండేషన్ ఏరియా మేనేజర్ సనూత్న, ట్రైనర్ శ్రావణి, కమ్యునిటీ ఫెసిలిటేటర్ వై శ్రీకాంత్, చందన్, ఉపసర్పంచ్ సంపత్‌రెడ్డి, అఖిల్, రైతులు పాల్గొన్నారు.


