మిల్లెట్స్‌తో ఆరోగ్యం
డిచ్‌పల్లి: మిల్లెట్స్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలకు ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, ఆరోగ్యానికి మిల్లెట్స్ ఎంతో మంచివని ఇక్రిశాట్ సీఈవో దినేశ్ చౌహాన్ అన్నారు. మండలంలోని ముల్లంగిలో సెర్ఫ్, ఇక్రిశాట్ సహకారంతో ఏర్పాటుచేసిన మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను దినేశ్‌చౌహాన్ బుధవారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు మేక లత పీఎంఎఫ్ ఎంఈ స్కీం కింద మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా దినేశ్ చౌహాన్ మాట్లాడుతూ.. మేక లతను ఆదర్శంగా తీసుకొని మహిళా సంఘాల సభ్యులు ఇటువంటి యూనిట్లు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సాయాగౌడ్, ఇక్రిశాట్ అధికారులు లక్ష్మీకాంత్, రాజశేఖర్, జిల్లా కో ఆర్డినేటర్ యశ్వంత్, డీపీఎం రాచయ్య, ఫామ్ ఏపీఎం రవికుమార్, డిచ్‌పల్లి మండల ఏపీఎం రవీందర్, ఉపసర్పంచ్ అశోక్, మాజీ ఎంపీపీ నర్సయ్య, మధుసూదన్, గ్రామ సంఘం అధ్యక్షురాలు భూదేవి, సీసీ సురేశ్, వీఏవోలు తదితరులు పాల్గొన్నారు.


