చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో డిసెంబర్ 29న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మూడోటౌన్ ఎస్సై హరిబాబు బుధవారం వివరాలు వెల్లడించారు. సుభాష్‌నగర్‌లో పది రోజుల క్రితం పూలు కోసేందుకు బయటికి వచ్చిన వృద్ధురాలి మెడలోని చైన్‌ను దుండగులు లాక్కొని పారిపోయారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన షేక్ మహ్మద్, అద్నాన్‌ను దుండగులుగా గుర్తించి అరెస్టు చేశారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు విచారణలో ఒప్పుకున్నారు. ఇదే కేసులో మరో నిందితుడు అమన్ పటేల్ పరారీలో ఉన్నారని ఎస్సై తెలిపారు. కేసు ఛేదనలో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సురేశ్, సిబ్బంది ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.


