క్రైం కార్నర్
చికిత్స పొందుతూ ఒకరి మృతి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన షెట్టి నాగరాజు(48) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. నాగరాజు కులవృత్తితోపాటు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు కూతుళ్లు ఉండగా ఇద్దరికి పెళ్లి చేశారు. మూడో కూతురు హైదరాబాద్‌లో నివసిస్తోంది. ఇద్దరి కుమార్తెల వివాహాల ఖర్చుల కారణంగా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. గతంలో నాగరాజు దుబాయి వెళ్లి అప్పుల పాలయ్యాడు. చిన్న కూతురు వివాహం చేయలేక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక జీవితంపై విరక్తి చెంది నాగరాజు ఈ నెల 2న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న నాగరాజును కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య శ్యామల ఉన్నారు.
క్రైం కార్నర్


