బాల్ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం ప్రారంభం
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి ఆ ల్ఫోర్స్ పాఠశాల లో బాల్ బ్యాడ్మింటన్ బాలికల జట్టు శిక్షణ శిబిరాన్ని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. పట్టణంలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి బాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నారు. అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ టీ విద్యాసాగర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోనగిరి శ్యామ్, ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్, పెగాడ నరేందర్, హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ, సీనియర్ క్రీడాకారులు కార్తీక్, సాయిశివ, లిఖిత, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


