హాకీ టోర్నీ పరిశీలకుడిగా స్వామికుమార్‌ | - | Sakshi
Sakshi News home page

హాకీ టోర్నీ పరిశీలకుడిగా స్వామికుమార్‌

Jan 8 2026 9:28 AM | Updated on Jan 8 2026 9:28 AM

హాకీ

హాకీ టోర్నీ పరిశీలకుడిగా స్వామికుమార్‌

సుభాష్‌నగర్‌: ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17 రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు వర్ని మండలం జాకోర జెడ్పీహెచ్‌ఎస్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ స్వామి కుమార్‌ పరిశీలకుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వనపర్తి జిల్లాలో రాష్ట్రస్థాయి హాకీ పోటీలు ఈ నెల 8 నుంచి 10 వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

కేజీబీవీ ఆకస్మిక తనిఖీ

మాక్లూర్‌ : మండల కేంద్రంలోని కేజీబీవీని జిల్లా విద్యాధికారి అశోక్‌ కుమార్‌ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల ప్రత్యేక అధికారిని స్రవంతిని విద్యార్థులకు సంబంధించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలకు సంబంధించి హాజరు పట్టిక, ఉపాధ్యాయుల హాజరు విషయాలను తెలుసుకున్నారు. వంటగదిలో సరుకుల నాణ్యత పరిశీలించారు.

దాతల సహకారంతో

గ్రంథాలయాల అభివృద్ధి

రెంజల్‌(బోధన్‌): దాతల సహకారంతో జిల్లాలోని శాఖా గ్రంథాలయాలను మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజరెడ్డి పేర్కొన్నారు. రెంజల్‌లోని శాఖా గ్రంథాలయాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. పాఠకులకు తాగునీరందించేందుకు ఆవరణలో బోరు మోటారు వేయిస్తానని గ్రామానికి చెందిన దాత ముందుకు రావడంతో ఆయన అభినందించారు. పాఠకులకు అవసరమైన అన్నిరకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకవస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని పలు గ్రంథాలయాల్లో సాంకేతికను అందిపుచ్చుకునేందుకు కంప్యూటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ నాగభూషణంరెడ్డి, బోధన్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌యాదవ్‌, కాంగ్రెస్‌ నాయకులు సాయిబాబా గౌడ్‌, పోచయ్య, షబ్బీర్‌, గవాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇసుక డంప్‌ స్వాధీనం

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ మండలం బెజ్జోరా గ్రామ శివారులోని పోచమ్మ దేవాలయం సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంప్‌ను రెవెన్యూ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రెవెన్యూ, మైనింగ్‌ శాఖ అధికారులు పోలీసులతో కలిసి తనిఖీ చేపట్టగా అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంప్‌ కనిపించింది. దీంతో డంప్‌ను స్వాధీనం చేసుకొని గ్రామ రెవెన్యూ సహాయకులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న ఇసుక డంప్‌ 140 ట్రాక్టర్ల వరకు ఉంటుందని ఆర్‌ఐ సాయాగౌడ్‌ తెలిపారు. ఇసుకను గురువారం తహసీల్‌ కార్యాలయం వద్ద వేలం వేస్తున్నట్లు పేర్కొన్నారు.

హాకీ టోర్నీ పరిశీలకుడిగా స్వామికుమార్‌ 1
1/3

హాకీ టోర్నీ పరిశీలకుడిగా స్వామికుమార్‌

హాకీ టోర్నీ పరిశీలకుడిగా స్వామికుమార్‌ 2
2/3

హాకీ టోర్నీ పరిశీలకుడిగా స్వామికుమార్‌

హాకీ టోర్నీ పరిశీలకుడిగా స్వామికుమార్‌ 3
3/3

హాకీ టోర్నీ పరిశీలకుడిగా స్వామికుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement