అభివృద్ధి దిశగా తెలంగాణ
ఎమ్మెల్యే భూపతిరెడ్డి
ధర్పల్లి: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో ముందుకెళ్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ధర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ మండలాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులు 200 మందికి ఎ మ్మెల్యే చెక్కులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా అత్యధికంగా వరి ధా న్యాన్ని పండించి మొదటి స్థానంలో నిలిచిందన్నా రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి వారికి పెద్దపీట వేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. చట్టసభల్లో ఎమ్మెల్సీ కవిత ఆత్మగౌరవం కోసమే తన పోరాటం అంటూ మొసలి కన్నీరు పెట్టుకోవడం సరైంది కాదని విమ ర్శించారు. కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న ఆస్తులను కవితకు వాటా ఇవ్వకపోవడంతోనే కంటతడి పెట్టిందని విమర్శించారు. తెలంగాణ ద్రోహులను చేరదీసింది కవితే అని విమర్శించారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి బీఆర్‌ఎస్ నాయకులకు లేదని స్పష్టం చేశారు. అనంతరం రామడుగు ప్రా జెక్ట్ నుంచి కుడి,ఎడమ కాలువల ద్వారా యాసంగి పంటలకు నీటిని విడుదల చేశారు. దమన్నపేట్‌లో ధర్పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దినకర్, కాంగ్రెస్ నాయకులు కర్నాల నరసయ్య కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజు, నాయకులు నవీన్ గౌడ్, ఇమ్మడి గోపి, చెలిమెల నరసయ్య, గంగారెడ్డి, సర్పంచులు శ్రీనివాస్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.


