తల్లిదండ్రుల కలను నిజం చేయాలి
● ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
ఖలీల్‌వాడి: విద్యార్థులు తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని, పోటీ ప్రపంచంలో సాంకేతికను అందిపుచ్చుకోవాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని నిశిత డిగ్రీ కళాశాలలో మొట్టమొదటి గ్రాడ్యుయేషన్ డేను బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సిద్ధం కావాలని సూచించారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని తెలిపారు. తెలంగాణ వర్సిటీ వీసీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరితో కలిసి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నిఖిల్, చీఫ్ ప్యాట్రన్ వినయ్, కో–ఆర్డినేటర్ రాజు, అకడమిక్ అడ్వైజర్ సాయిలు, డైరెక్టర్ షేక్, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వప్న, వైస్ ప్రిన్సిపాల్ రఘువీర్, అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బాలకిష్టారెడ్డికి సన్మానం..
నగరంలోని వివిధ కళాశాల సందర్శనకు వచ్చిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డిని ఎస్‌ఎస్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్, టీయూ పాలక మండలి మాజీ సభ్యులు మారయ్య గౌడ్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన సమూల మార్పులపై చర్చించారు.
తల్లిదండ్రుల కలను నిజం చేయాలి


