సర్వే ఆధారంగానే టికెట్లు
ఆర్మూర్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ వార్డు నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి సర్వే నిర్వహించిన అనంతరం గెలుపు గుర్రాలకు మాత్రమే అధిష్టానం టికెట్ కేటాయిస్తుందని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ టికెట్ ఎవరికి కేటాయించినా వారి విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సీ కన్వెన్షన్‌లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నిర్ణయానికి ప్రతీ కార్యకర్త కట్టుబడి ఉండాలన్నారు. అలా ఉండని వారిపై వేటు తప్పదని హెచ్చరించారు. అంతకు ముందు టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ (చిన్న), మార చంద్రమోహన్, ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు లింగాగౌడ్, షేక్ మున్నా, ఏఎంసీ వైస్ చైర్మన్ ఇట్టెం జీవన్, నాయకులు సంజయ్ సింగ్ బబ్లు, పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, జంబి హనుమాన్ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రేగుళ్ల సత్యనారాయణ, నాయకులు మహమూద్ అలీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): ఏబీవీపీ స్టేట్ ఆల్ యూనివర్సిటీస్ కన్వీనర్‌గా శివ ఎన్నికయ్యారు. ఇటీవల నిర్వహించిన ఏబీవీపీ నూతన రాష్ట్ర కార్యవర్గ నియామకంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రావుల కృష్ణ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు బీ శివను స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్‌గా ఎన్నుకున్నారు.
● గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత
● పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే వేటు తప్పదు
● డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి
సర్వే ఆధారంగానే టికెట్లు


