ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
నిజామాబాద్ లీగల్: వాహనాలు నడిపేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని నిజామాబాద్ జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రూపొందించిన పోస్టర్లను జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి సాయిసుధా, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీతో కలిసి జడ్జి ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం సరైన అవగాహన లేకుండా, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడంతో జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని, ట్రిపుల్ రైడింగ్‌ను నివారించాలని సూచించారు. సంక్రాంతి సందర్భంగా పిల్లలు గాలిపటాలు ఎగరవేసేటప్పుడు పెద్దలు వారిని గమనించాలని, చైనా మాంజాతో ప్రమాదాలు జరుగుతున్నాయని, దానిని వాడొద్దన్నారు.
జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి


