సరిపడా యూరియా నిల్వలు
నందిపేట్(ఆర్మూర్): ప్రస్తుత యాసంగి సీజన్ కు జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉ న్నాయని, రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి సూచించారు. మండలంలోని అయిలాపూర్ సొసైటీ పరిధిలో ఉన్న కంఠం, అయిలాపూర్ లోని గోదాములతోపాటు కుద్వాన్‌పూర్ సొసైటీ పరిధిలోని వన్నెల్ కే, కుద్వాన్‌పూర్‌లోని ఎరువుల గోడౌన్ లను బుధవారం పరిశీలించారు. యూరియా దొరకదనే ఆందోళనతో ముందస్తుగా నిల్వ చే సుకోవద్దని, అవసరానికి అనుగుణంగా మాత్ర మే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. మోతాదుకు మించి యూరియా వాడొద్దన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా సకాలంలో యూరి యా సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. ఆయనవెంట మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు, ఏఈవోలు విజయ్, గంగాధర్, అబ్దుల్, సొసైటీల సిబ్బంది ఉన్నారు.


