సమాజ ఉన్నతిలో విద్య కీలకం
● ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
ఖలీల్‌వాడి: సమాజ ఉన్నతికి విద్య ఎంతో తోడ్పడుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలను బుధవా రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. విద్యను ఉన్నతీకరించే ప్రయత్నంలో విశ్వవిద్యాలయాలు సంస్కరణలు చేపడుతున్నాయని, సమస్య లను అఽ దిగమిస్తూ వ్యవస్థలో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామ్మోహన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ రంగరత్నం, పీఆర్‌వో దండు స్వామి, ఎన్‌సీసీ అధి కారి లెఫ్టినెంట్ రామస్వామి, అధ్యాపకులు రంజిత, వినయ్‌కుమార్, ముత్తెన్న, చంద్రశేఖర్, జయప్రసాద్, రామకృష్ణ, రమేశ్‌గౌడ్, బాలమణి, పూర్ణ చందర్, కార్యాలయ సి బ్బంది తదితరులు పాల్గొన్నారు.
క్వార్టర్ ఫైనల్‌కు
నిఖత్ జరీన్
సుభాష్‌నగర్: నేషనల్ సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ ముందంజ వేసింది. గ్రేటర్‌నోయిడాలో నిర్వహిస్తున్న పోటీల్లో మొదటి రౌండ్‌లో 5–0తో చండీగఢ్‌కు చెందిన నిధి పై నిఖత్ విజయం సాధించింది. మహిళల 48–51 కిలోల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్, లడఖ్‌కు చెందిన కుల్సూమా బానోపై పైచేయి సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గురువారం అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన బాక్సర్‌తో నిఖత్ పోటీపడనుంది.
లేగ దూడపై చిరుత దాడి
సిరికొండ: రేంజ్ పరిధిలోని తిరుపతిగుట్ట అటవీ ప్రాంతంలో ఈ నెల 6వ తేదీన లేగ దూడపై చిరుత దాడి చేసి చంపిందని ఇన్‌చార్జి రేంజర్ రవీందర్ బుధవారం తెలిపారు. గోప్యానాయక్ తండాకు చెందిన మలావత్ రఘుపతికి చెందిన లేగదూడ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లి చోట మృతి చెందడంతో అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారన్నారు. తమ సిబ్బంది అక్కడికి వెళ్లి పరిశీలించగా లేగదూడపై చిరుత దాడి చేసినట్లు నిర్దారణ అయ్యిందన్నారు. ఘటనాస్థలంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయగా, లేగ దూడ కళేబరాన్ని తినడానికి వచ్చిన చిరుత కెమెరాకు చిక్కినట్లు తెలిపారు. అటవీ శాఖ ద్వారా బాధితుడికి నష్ట పరిహారం మంజూరు చేయిస్తామని అన్నారు. అటవీ జంతువులు పశువులపై దాడి చేస్తే ఎలాంటి విషప్రయోగం చేయొద్దని, అలా చేస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. పశువులపై అటవీ జంతువులు దాడి చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
సమాజ ఉన్నతిలో విద్య కీలకం
సమాజ ఉన్నతిలో విద్య కీలకం


