రాకాసి కంపెనీలొద్దు
భారీ బందోబస్తు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/భిక్కనూరు : ‘‘కెమికల్, ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నం. అలాంటి మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మా బతుకులు నాశనం అవుతాయి. కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలు మాకొద్దు’’ అంటూ భిక్కనూరు మండలంలోని భిక్కనూరు, కాచాపూర్, పెద్దమల్లారెడ్డి, అ య్యవారిపల్లి, మల్లుపల్లి, రామేశ్వర్‌పల్లి, బస్వాపూర్ తదితర గ్రామాల ప్రజలు నినదించారు. భిక్కనూరు శివారులో ఏర్పాటు చేస్తున్న మెన్సర్స్ ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (బల్క్ డ్రగ్) కంపెనీకి సంబంధించి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆఽ ద్వర్యంలో బుధవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. అదనపు కలెక్టర్ విక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారి లక్ష్మీనారాయణ, కామారెడ్డి ఆర్డీవో వీణ తదితరులు పాల్గొన్నా రు. 39 మంది ప్రతినిధులు ఫార్మా ఫ్యాక్టరీ ఏర్పా టును వ్యతిరేకించారు. ఇప్పటికే ఉన్న కంపెనీలు వెదజల్లుతున్న కాలుష్యంతో పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ఉద్యోగాల ఆశ చూపి ఫ్యాక్టరీలు పెడుతూ నీరు, గాలి, నేల కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. కంపెనీ ఏర్పాటు చేయొద్దంటూ వేలాది మంది నినాదాలు చేశారు.
ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా భారీ పో లీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐలు సంపత్‌కుమార్, తిరుపయ్య ఎస్సై ఆంజనేయులతో పాటు డివిజన్‌లోని అందరూ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంగణం వరకు వాహనాలను అనుమతించలేదు. సుమారు అరకిలోమీటరు దూరంలోనే వాహనాలను నిలిపివేయడంతో ప్రజలు కాలినడకన వచ్చారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దంటూ చే పట్టిన భిక్కనూరు బంద్ విజయవంతమైంది.
ఇప్పటికే ఉన్న ఫ్యాక్టరీలతో
అనారోగ్యం పాలవుతున్నాం
కొత్తగా ఫార్మా కంపెనీని
ఏర్పాటు చేస్తే ఊరుకోం
ప్రజాభిప్రాయ సేకరణలో
స్పష్టం చేసిన భిక్కనూరు ప్రజలు


