రిజర్వేషన్లపై ఉత్కంఠ
● రాష్ట్రం యూనిట్‌గా
మున్సిపల్ చైర్‌పర్సన్..
● మున్సిపల్ యూనిట్‌గా వార్డు
కౌన్సిలర్‌ల రిజర్వేషన్లు
ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికలకు అధికారులు ఓవై పు ఏర్పాట్లు చేస్తుండగా.. మరో వైపు ఆశావహులతోపాటు రాజకీయ పార్టీల్లో రిజర్వేషన్ ల ఖరారుపై ఉత్కంఠ నెలకొంది. నిజామాబా ద్ కార్పొరేషన్‌లో మేయర్‌తోపాటు కార్పొరేటర్ పదవులకు, జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్‌లో చైర్మన్ పీఠం, వా ర్డు కౌన్సిలర్ సీట్లు ఏ కేటగిరికి రిజర్వ్ అవుతా యోననే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నెల 10వ తేదీన తుది ఓటరు జాబితా ప్రకటించిన వెంటనే సామాజికవర్గాలుగా ఓటర్ల జాబితాను విభజించి అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. బరిలో నిలవాలనుకుంటున్న ఆశావహులు ఎమ్మెల్యేలను, పార్టీల ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే ప్రయ త్నాలను ముమ్మరం చేస్తున్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఏ పీఠం ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ నెలకొంది.
దామాషా పద్ధతిలో..
కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్‌లను రాష్ట్ర యూనిట్‌గా, కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్‌ల పదవులను కార్పొరేషన్, మున్సిపల్ యూనిట్‌గా ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం మున్సి పాలిటీల్లో చైర్‌పర్సన్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం దామాషా పద్ధతిలో రిజర్వు చేయనున్నారు. మరో 50 శాతం జనరల్ కేటగిరీలో ఉండనున్నాయి. అయితే మొత్తంగా 50 శాతం స్థానాలను మహిళలకు రిజర్వు చేస్తారు. అయితే జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో రాష్ట్రం యూనిట్‌గా పరిగణలోకి తీసుకుంటే ఏ స్థానం ఏ కేటగిరీకి రిజర్వ్ అవుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36, బోధన్ మున్సిపాలిటీలో 38, భీమ్‌గల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల సంఖ్యలో సగ భాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, మిగిలినిన 50 శాతం జనరల్‌కు రిజర్వు కానున్నాయి. మొత్తంగా 50 శాతం కౌన్సిలర్ స్థానాలు మహిళలకు రిజర్వు కానున్నాయి. అయితే ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రధాన రాజకీయ పార్టీల ఆశావహులు అంచనాలు, ఊహాగానాలతో తమకే అనుకూలిస్తుందనే గట్టి నమ్మకంతో పోటీకి సిద్ధమవుతున్నారు.


