సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సుభాష్‌నగర్: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఈనెల 9 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు రీజియన్ మేనేజర్ టి జ్యోత్స్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ (జేబీఎస్) నుంచి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డికి ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. పండుగ రోజుల్లోనూ ఆర్డీసీ మహాలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తుందని తెలిపారు. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నిజామాబాద్ రీజియన్ ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా జేబీఎస్‌లో డిపోలవారీగా ప్రత్యేక ఆఫీసర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడం ద్వారా సౌకర్యవంతంగా, ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చన్నారు. టికెట్ బుకింగ్ సౌకర్యం ఆర్టీసీ ఆన్‌లైన్ వెబ్‌సైట్ www.tgartcbus.in, టీజీఎస్‌ఆర్టీసీ గమ్యం యాప్‌లో అందుబాటులో ఉందని ఆర్‌ఎం తెలిపారు.
డిపోల వారీగా జేబీఎస్ నుంచి నడవనున్న బస్సులు
డిపో ప్రత్యేక బస్సులు
నిజామాబాద్–1 96
నిజామాబాద్–2 53
ఆర్మూర్ 94
బోధన్ 86
బాన్సువాడ 74
కామారెడ్డి 97
మొత్తం 500


