కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలి
● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
● కామారెడ్డిలో రాష్ట్ర స్థాయి
సైన్స్ ఫెయిర్ ప్రారంభం
కామారెడ్డి టౌన్: మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ హైస్కూల్‌లో (అబ్దుల్ కలాం ప్రాంగణం) బుధవా రం 53వ బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ మనక్ రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌ను షబ్బీర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబ్దుల్ కలాంను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నూతన టెక్నాలజీపై విద్యార్థులు పట్టు సాధించాలని ఎంపీ సురేశ్ షెట్కార్ సూచించారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించడంలో సైన్స్ ఫెయిర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
33 జిల్లాల నుంచి మొత్తం 887 ప్రదర్శనలను ఆ యా విభాగాలలో విద్యార్థులు ప్రదర్శించారు. ఒక విద్యార్థితో ఒక గైడ్ టీచర్ పాల్గొంటున్నారు.


