వారంలో మూడురోజులు ప్రజాబాట
సుభాష్‌నగర్: జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో వారంలో మూడు రోజులు (మంగళ, గురు, శనివారాల్లో) ఏఈలు సిబ్బందితో కలిసి ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్‌పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ (ఆపరేషన్, వరంగల్) అశోక్ సూచించారు. ఈ మేరకు బుధవారం నగరంలోని పవర్‌హౌజ్ సమావేశపు హాలులో విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. ప్రజాబాటలో ఎస్‌ఈలు, డీఈలు, ఏడీఈలు పాల్గొనాలని, ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామాల్లో తిరిగి విద్యుత్ సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. పొలం బాట, పట్టణ బాట కూడా నిర్వహించి వినియోగదారులకు భద్రత అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ నియంత్రికలు చెడిపోకుండా చూడాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు, డీఈ టెక్నికల్ ఏ రమేశ్, ఎస్‌ఏవో శ్రీనివాస్, డీఈలు ఎం శ్రీనివాస్, ఎండీ ముక్తార్, రఘు, ఏడీఈలు, ఏఈలు, ఏఏవోలు పాల్గొన్నారు.


