
కామారెడ్డి ఇన్‌చార్జి డీఈవోగా అశోక్
నిజామాబాద్ అర్బన్/బాన్సువాడ రూరల్: జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి డీఈవోగా బుధవారం అదన పు బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి డీఈవో పది రోజులపాటు సెలవులో వెళ్లడంతో అశోక్‌కు బాధ్యతలు అప్పగించారు.
చదివిన బడిని చూసి
మురిసిన అధికారి..
దేశాయిపేట్ జెడ్పీ హైస్కూల్‌ను ఇన్‌చార్జి డీ ఈవో అశోక్ సందర్శించారు. ఆయన స్వస్థ లం సోమేశ్వర్ గ్రామం. తాను చదువుకున్న దేశాయిపేట్ హైస్కూల్‌లో ఆయన కలియదిరిగారు. తాను ఇదే పాఠశాలలో ఏడో తర గతి వరకు చదువుకున్నట్లు తెలిపారు.
యువవికాసం దరఖాస్తుల పరిశీలన వాయిదా
నిజామాబాద్ సిటీ: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న ధ్రువీకరణ పత్రాల పరిశీలనను వాయిదా వేసినట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్‌కుమార్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి సర్టిఫికెట్లు, ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్‌ను ఈనెల 24, 25, 26 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా వాయిదాపడింది. తదుపరి తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సుభాష్‌నగర్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరా యం ఉంటుందని టౌన్–2 ఏడీఈ ప్రసాద్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దుబ్బ ఏఎస్ 11 కేవీ ఎస్‌జీ ఫీడర్‌లో ఏబీ స్విచ్‌లు ఏర్పాటు కారణంగా ఉదయం 10 నుంచి 12 గంటల అంతరాయం ఏర్పడు తుందన్నారు. బైపాస్ రోడ్, గౌడ్స్ కాలనీ, గుమాస్తా కాలనీ, మహేశ్వరి భవన్, బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలుస్తుందని పేర్కొన్నారు.