తెయూ డిగ్రీ పరీక్షలు వాయిదా | - | Sakshi
Sakshi News home page

తెయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

Apr 22 2025 2:14 AM | Updated on Apr 22 2025 2:14 AM

తెయూ

తెయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 28 నుంచి ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెగ్యులర్‌ 2, 4, 6వ సెమిస్టర్‌, బ్యాక్‌లాగ్‌ 1, 3, 5 వ సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి సంపత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఫీ జు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చే యకపోవడం, ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ప్రయివేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు పరీక్షల నిర్వహణకు నిరాకరించడంతో వాయిదా వేసినట్లు సమాచారం.

కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను

రెగ్యులరైజ్‌ చేయాలి

తెయూ(డిచ్‌పల్లి): యూనివర్సిటీల్లో రెగ్యులర్‌ ప్రొఫెసర్లతో సమానంగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు, ధర్పల్లి మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రకమిటీ పిలుపు మేరకు తెయూ క్యాంపస్‌లో నిరసన దీక్షలు చేపట్టిన తెయూ కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు సోమవారం బాజిరెడ్డి జగన్‌ సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. యూనివర్సిటీ ల్లో కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతి లో పని చేస్తున్న వారికి తగిన న్యాయం చేయకుండా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ కి మార్గదర్శకాలు జారీచేయడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు. వర్సిటీల్లో పని చేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులకు అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు.

మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు

పెంపొందించుకోవాలి

తెయూ(డిచ్‌పల్లి): మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, మారుతున్న ధోరణులతోపాటు మన సంస్కృతి, సాంప్రదాయాలను కూడా అనుసరించాలని ప్రొఫెసర్‌ సీహెచ్‌ ఆంజనేయులు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమంలో భాగంగా ‘ట్రెడిషనల్‌ ట్రెండ్స్‌’ అనే అంశంపై సాంప్రదా య దుస్తుల పోటీలను నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా అధ్యాపకులు వాణి, రాజేశ్వరి, ఈవెంట్‌ మేనేజర్లుగా వెంకటేష్‌, మౌనిక, నవిత వ్యవహరించారు. పోటీలో స్వరూప (ప్రథమ), ప్రేమ్‌కుమార్‌ (ద్వితీయ), సందీప్‌ (తృతీయ) బహుమతులు అందుకున్నారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ ధ్రువపత్రాలను అందజేశారు.

ఎస్సైల బదిలీలు

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ మల్టీ జోన్‌–1 ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జక్రాన్‌ పల్లి ఎస్సై తిరుపతిని, ఆర్మూర్‌ ఎస్సై–1 మహే ష్‌ను, మెండోరా ఎస్సై నారాయణను వీఆర్‌కు అటాచ్‌ చేశారు. సీసీఎస్‌లో పని చేస్తున్న రమే ష్‌ను ఆర్మూర్‌ ఎస్సై–1గా నియమించారు. నిర్మల్‌ జిల్లా లక్ష్మణచందా పీఎస్‌ ఎస్సై మాలిక్‌ రెహమాన్‌ను జక్రాన్‌పల్లి ఎస్సైగా బదిలీ చేశారు. రెండో టౌన్‌ ఎస్సై యాసిర్‌ అరాఫత్‌ను మెండోరా ఎస్సైగా నియమించారు. జగిత్యాల్‌ వీఆర్‌లో ఉన్న సయ్యద్‌ ఇమ్రాన్‌ను రెండోటౌన్‌ ఎస్సైగా బదిలీచేశారు.

తెయూ డిగ్రీ పరీక్షలు వాయిదా
1
1/1

తెయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement