
యువతిని వేధించిన యువకుడి అరెస్ట్
బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని సోషల్ మీడియాలో వేధించిన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకుర్తి గ్రామానికి చెందిన అలీమ్ బేగ్‌ను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు బోథ్ ఎస్సై ఎల్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. యువతిని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అలీమ్‌బేగ్ వేధిస్తున్నాడని తెలిపారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు అలీమ్‌బేగ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా అలీమ్‌బేగ్‌పై రౌడీషీట్ ఉన్నట్లు పేర్కొన్నారు. రెంజల్ పోలీస్‌స్టేషన్‌లో నాలుగు కేసులు ఉన్నాయన్నారు. డిచ్‌పెల్లి పోలీస్‌స్టేషన్‌లో 2023లో అలీమ్‌బేగ్ వద్ద నుంచి 17 బైక్‌లు రికవరీ చేసినట్లు తెలిపారు.
నాటు తుపాకులతో పాటు ఇద్దరి అరెస్టు
తాడ్వాయి: మండలంలోని కన్‌కల్ గ్రామంలో నాటు తుపాకులతో తిరుగుతున్న ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన తిల్ పీత్య మహేందర్‌సింగ్, తిల్ పీత్య ఇందర్‌సింగ్ మండలంలోని కన్‌కల్‌లో కొంతకాలంగా నివసిస్తూ లేబర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు శుక్రవారం తాడ్వాయిలోని కల్లు డిపో వద్ద నాటుతుపాకులతో తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి చేరుకొని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
ఎల్లారెడ్డి: పట్టణంలోని గ్యాస్ గోదాంలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అగ్నిమాపక అధికారులు శుక్రవారం అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా పట్టణంలోని హెచ్‌పీ గ్యాస్ గోదాంలో అవగాహన నిర్వహించారు. కార్యక్రమంలో ఫైర్ అధికారులు వినోద్, నరేందర్ తదితరులున్నారు.

యువతిని వేధించిన యువకుడి అరెస్ట్