
నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన
డిచ్‌పల్లి: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మారం(బి), బర్థిపూర్, మెంట్రాజ్పల్లి, దేవుపల్లి, దేవునగర్, నడిపల్లి, అమృతాపూర్ గ్రామాలోల్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన/ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. విజయవంతం చేయాలని ఆయన కోరారు.
దాశరథి పురస్కారానికి ప్రేమ్‌లాల్ ఎంపిక
నిజామాబాద్ రూరల్: జిల్లాకు చెందిన కవి, ఉపాధ్యాయుడు ప్రేమ్‌లాల్ ప్రతిష్టాత్మక దాశరథి పురస్కారానికి ఎంపికయ్యాడని సాహిత్య రంగంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి దశరథి ఆర్గనైజషన్ కన్వీనర్ సతీష్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. మే 1న హైదరాబాద్‌లో పురస్కార ప్రదాన కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా కవులు అభినందనలు తెలిపారు.