అక్రమ వడ్డీ వ్యాపారులపై దాడులు | - | Sakshi
Sakshi News home page

అక్రమ వడ్డీ వ్యాపారులపై దాడులు

Apr 18 2025 1:47 AM | Updated on Apr 18 2025 1:47 AM

అక్రమ

అక్రమ వడ్డీ వ్యాపారులపై దాడులు

ఖలీల్‌వాడి : నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్లలో అక్రమ వడ్డీ వ్యాపారుల ఇళ్లు, కా ర్యాలయాలపై పోలీసులు గురువారం దా డులు నిర్వహించారు. ఉదయం 5 నుంచి 10 గంటల వరకు సోదాలు చేశారు. ప్రభు త్వ అనుమతి, రిజిస్ట్రేషన్‌ లేకుండా అక్రమంగా ఫైనాన్స్‌లు ఏర్పాటు చేసుకొని వడ్డీ వ్యా పారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ వడ్డీ దందా నిర్వహిస్తున్నారనే ఫిర్యా దులు రావడంతో సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు దాడులు చేపట్టారు. సోదాల్లో భాగంగా నిజామాబాద్‌ డివిజన్‌లో 27 ఫైనాన్స్‌ నోట్స్‌, 543 ప్రామిసరీ నోట్స్‌, ఒక వాహనం, రూ.53.09లక్షల నగదు, ఆర్మూర్‌ డివిజన్‌లో 4 ఫైనాన్స్‌ నోట్స్‌, 610 ప్రామిసరీ నోట్స్‌, 21 సేల్‌ డీడ్స్‌, 5 బాండు పేపర్లు, రూ.2.76లక్షల నగదు, బోధన్‌ డివి జన్‌లో 282 ప్రామిసరీ నోట్స్‌, 22 సేల్‌ డీడ్స్‌, రెండు వాహనాలు, 25 బాండ్‌ పేప ర్లు, రూ.12.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో జడ్జిల బదిలీలు

ఖలీల్‌ వాడి : జిల్లాలో సీనియర్‌ సివిల్‌ జడ్జిలను బదిలీ చేస్తూ గురువారం హైకోర్టు రిజి స్ట్రార్‌ (విజిలెన్స్‌) ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ అడిషనల్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ ఆర్మూర్‌ జడ్జి నసీమా సుల్తానా నాగర్‌కర్నూల్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థకు బదిలీ కాగా, బోధన్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి దేవాన్‌ అజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌ లోని 15 అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ జడ్జిగా బదిలీ అయ్యారు. ఎల్‌బీ నగర్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ కార్యదర్శి శ్రీదేవి సీనియర్‌ సివిల్‌ జడ్జిగా ఆర్మూర్‌కు బదిలీ అయ్యారు. నిజామాబాద్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ కార్యదర్శి పద్మావతి సికింద్రాబాద్‌ లోని 11వ మెట్రోపాలిటన్‌కు బదిలీ కాగా, నిజా మాబాద్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీకాంత్‌ బాబు హైదరాబాద్‌ లోని ఒకటవ మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ గా బదిలీ అయ్యారు. 17వ సివిల్‌ కోర్టు అడిషనల్‌ జడ్జి కాంచన రెడ్డి బోధన్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి, అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జిగా బదిలీ అయ్యారు.

పశువుల సంరక్షణకే వ్యాధి నివారణ టీకాలు

జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి రోహిత్‌రెడ్డి

ఆర్మూర్‌ : పశువులన్నింటికీ గాలికుంటు వ్యాధి సోకకుండా సంరక్షించేందుకే వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి రోహిత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. టీకాలు వేసే కార్యక్రమాన్ని రోహిత్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి, పశువైద్యం అందుతున్న విధివిధానాలపై పాడిరైతులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెల 15 వరకు పశువులకు టీకాలు వేసే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రాజేశ్వర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, రాధ, దివ్య, శ్రీనివాస్‌, అంకాపూర్‌ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కృతజ్ఞత సభ

పోస్టర్‌ ఆవిష్కరణ

నిజామాబాద్‌ అర్బన్‌ : స్కూల్‌ అసిస్టెంట్లు గా ప్రమోషన్లు పొందిన తెలుగు, హిందీ, ఉ ర్దూ భాషోపాధ్యాయులంతా ప్రభుత్వానికి కృతజ్ఞత చాటుకోవడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ పేర్కొన్నా రు. ఈ నెల 20న న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించనున్న రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ కృతజ్ఞత సభ పోస్టర్‌ను తన కా ర్యాలయంలో డీఈవో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమోషన్లు పొందిన వారంతా బాధ్యతాయుతంగా పనిచేసి జిల్లా విద్యాశాఖను అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహమ్మద్‌ జమీలుల్లా, కేవీ రమణాచారి, రాష్ట్ర సహాధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌, సంఘ బాధ్యులు రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ వడ్డీ  వ్యాపారులపై దాడులు
1
1/1

అక్రమ వడ్డీ వ్యాపారులపై దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement