పింక్‌ బుక్‌ నిండాలి.. వారి పాపం పండాలి.. | - | Sakshi
Sakshi News home page

పింక్‌ బుక్‌ నిండాలి.. వారి పాపం పండాలి..

Apr 16 2025 11:06 AM | Updated on Apr 16 2025 11:06 AM

పింక్‌ బుక్‌ నిండాలి.. వారి పాపం పండాలి..

పింక్‌ బుక్‌ నిండాలి.. వారి పాపం పండాలి..

డిచ్‌పల్లి: ఇకపై కేసీఆర్‌ 3.0 వర్షన్‌ చూస్తారని, బీఆర్‌ఎస్‌ పార్టీ మునపటి పార్టీ కాదని, అందరి లెక్కా తేలుస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నా రు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులకు కొందరు పోలీసులు గు లాంగిరీ చేస్తున్నారని వారి పేర్లన్నీ పింక్‌ బుక్‌లో రాస్తున్నామని, పింక్‌ బుక్‌ నిండాలి.. వారి పాపం పండాలని హెచ్చరించారు. ఇకపై తాను సైలెంట్‌ గా ఉండనని, కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూ స్తానని హామీ ఇచ్చారు. మంగళవారం రాత్రి డిచ్‌ప ల్లి మండల కేంద్రంలోని జీ కన్వెన్షన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కవిత పలు వ్యాఖ్యలు చేశారు. ప్రా ణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్‌ ను అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రశంసించారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో అనేక సంక్లిష్ట పరిస్థితులను, ఇబ్బందులను ఎదుర్కొన్నామన్నారు. కేసీఆర్‌ కానీ గులాబీ జెండా కానీ లేకపో తే తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఇప్పుడు అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీకి వెళితే మీ తెలంగాణలో 20 పర్సెంట్‌ సర్కారు నడుస్తుందట కదా అని అడుగుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల్లో చెట్లను కొట్టివేస్తే న్యూయార్క్‌లో చర్చ నడుస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ కాంప్రమైజ్‌ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఎంపీ అర్వింద్‌ పసుపుబోర్డు తెచ్చానని చెబుతున్నారు.. కానీ కేవలం గెజిట్‌ మాత్రమే ఇచ్చారని బోర్డుకు చట్టబద్ధత లేదన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఆమోదిస్తేనే ఏబోర్డుకై నా చట్టబద్ధత వస్తుందని, ఈ విషయమై ఎంపీ అర్వింద్‌ ను తాను హెచ్చరించినట్లు కవిత తెలిపారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్‌ హిందు త్వం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రూరల్‌ నియోజకవర్గానికి పట్టిన శని ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి అని ధ్వజమెత్తారు. రూరల్‌ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన అ బద్దపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. ఇప్పుడు అదే ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టమని కేసీఆర్‌ను వేడుకుంటున్నారని తెలి పారు. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం కానీ అడ్డదారిలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని తమతో కేసీఆర్‌ చెప్పారని పేర్కొన్నారు. కేసీఆర్‌ స్థానంలో కవిత ఉంటే ప్రభుత్వాన్ని తప్పక పడగొట్టేదని బాజిరెడ్డి అన్నారు. సీ ఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఇసు క, ఇటుక, మొరంతో పాటు ధాన్యం సంచుల్లో కూ డా బరితెగించి అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు రూ.150 కోట్ల అభి వృద్ధి పనులకు తాను జీవోలు తెచ్చానని, పాత జీవోలకు శంకుస్థాపనలు చేయడానికి భూపతిరెడ్డి సిగ్గుపడాలని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ లు ప్రసంగించారు. మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సొసైటీ చైర్మన్లు, పార్టీ మండల అధ్యక్షులు, వివిధ విభాగాల నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారిని

వదిలిపెట్టే ప్రసక్తే లేదు

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సన్నాహక

సమావేశంలో ఎమ్మెల్సీ కవిత

ఊరూరూ తరలి వచ్చి సభను

విజయవంతం చేయాలని పిలుపు

2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఢిల్లీకి వెళ్లిన బాజిరెడ్డి గోవర్ధన్‌తో తాను మాట్లాడి రూరల్‌ ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్‌ నుంచి నిలబడేలా ఒప్పించానని తెలిపారు. కేసీఆర్‌ వెన్నంటి ఉండి బాజిరెడ్డి అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. ఈ నెల 27న వరంగల్‌ ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు ఊరురా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సక్సెస్‌ చేయాలని కవిత పిలుపునిచ్చారు. వరంగల్‌ సభ తెలంగాణ కుంభమేళాగా చరిత్ర లో నిలిచిపోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement