ముగిసిన యువవికాసం దరఖాస్తు గడువు
నిజామాబాద్‌అర్బన్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువవికాసం దరఖాస్తుల గడువు సోమవారంతో ముగిసింది. ఆయా కార్పొరేషన్‌ల పరిధిలో లక్ష్యానికి మించి దరఖాస్తులు అందాయి. ఈనెల 5వ తేదీ వరకు దరఖాస్తు గడువు ఉండగా, ఆ తరువాత 14వ తేదీకి పొడిగించారు. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది.
ఎంపిక చేసేది 22,285 మందిని..
ఆయా కార్పొరేషన్‌ల పరిధిలో 22,285 లబ్దిదా రులను ఎంపిక చేయనున్నారు. ఎస్సీ కార్పొరేష న్ పరిధిలో 5817, ఎస్టీ కార్పొరేషన్‌లో 3088, బీసీ కార్పొరేషన్‌లో 7969, ఈడబ్ల్యూఎస్ 2,326, మైనారిటీ కార్పొరేషన్‌లో 2911 , క్రిస్టియన్ మైనారిటీలో 174 మంది లబ్ధిదారులను ఆ యా నియోజక వర్గాల వారీగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్‌లో ఎక్కువ.. ఆఫ్ లైన్‌లో తక్కువ
ఆన్‌లైన్‌లో 58,896 మంది దరఖాస్తు చేసుకోగా, మండల పరిషత్ కార్యాలయాలు, మున్సిపాలిటీల్లో 18,452 మంది హార్డ్ కాపీలను అందజేశారు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న వారు ఇంకా 40,444 మంది తమ దరఖాస్తులను అధికారులకు అందజేయాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకోకుండా ఆఫ్‌లైన్‌లో అధికారులకు జిల్లా వ్యాప్తంగా కేవలం నలుగురు మాత్రమే దరఖాస్తులను అందజేశారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారు చాలా మంది కులం, ఆదాయ ధ్రువీకరణపత్రాలు ఆలస్యం కావడంతో హార్ట్‌కాపీలను సంబంధిత కార్యాలయంలో అందజేయలేదు. ఇదిలా ఉండగా అత్యంగా బీసీ కార్పొరేషన్‌కు దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. వివిధ వృత్తులు, వ్యాపారాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఎక్కువగా ఉన్నారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్న సిబ్బంది (ఫైల్)
దరఖాస్తు చేసుకున్నవారు అందజేయాలి
ఈనెల 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారు హార్డ్ కాపీలను స్థానిక ఎంపీడీవో కా ర్యాలయం, మున్సిపాలిటీల్లో అందజేయాలి. గడువు పొడిగింపుపై సమాచారం లేదు. – రమేశ్,
జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి
దరఖాస్తులు
కార్పొరేషన్ ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ అధికారులకు
అందినవి
ఎస్సీ 10,845 1 3,792
ఎస్టీ 4,590 - 1760
బీసీ 29,638 3 10,090
ఈబీసీ/ఈడబ్ల్యూఎస్ 1317 - 305
మైనారిటీ 12253 - 2425
క్రిస్టియన్ 253 - 80
మొత్తం 58,896 4 18,452
ఆన్‌లైన్ దరఖాస్తులు 58,896
ఆఫ్‌లైన్ దరఖాస్తులు 04
అధికారులకు హార్డ్‌కాపీలను
అందజేయని 40,444 మంది
ముగిసిన యువవికాసం దరఖాస్తు గడువు


