తల్లి చేపలను అందించాలి
బాల్కొండ: చేప పిల్లల కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి కోసం కావాల్సిన చేప పిల్లలను చెరువుల నుంచి మత్స్యకారులు అందించాలని జిల్లా మత్స్యశాఖ ఏడీ అంజనేయస్వామి అన్నారు. మంగళవారం మెండోరా మండలం పోచంపాడ్ వద్ద గల జాతీయ చేప పిల్లల కేంద్రాన్ని పరిశీలించారు. ప్రస్తుత సంవత్సరం సకాలంలో చేప పిల్లల ఉత్పత్తి చేపట్టేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. చేపపిల్లల ఉత్పత్తి కోసం తల్లి చేపల సేకరణ ప్రారంభిస్తామన్నారు. అందుకు మత్స్య సహ కార సంఘాలు సహకారమందించాలన్నారు. తల్లి చేపలకు కిలోల చొప్పున ధర చెల్లిస్తామన్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం నాటికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎఫ్‌డీవో దామోదర్, సిబ్బంది ఉన్నారు.


