ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. రాత్రి చలి ప్రభావం పెరుగుతుంది. ఉదయం పొగమంచు కురుస్తుంది.
రుచిత అథ్లెటిక్స్‌లో చిరుత..
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు..
కడెం మండలం అల్లంపల్లి జీయర్ గురుకులంలో 70వ, రాష్ట్రస్థాయి పాఠశాల ఆర్చరీ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
దిల్‌వార్‌పూర్ మండల కేంద్రానికి చెందిన నామాయి రుచిత జాతీయస్థాయి అథ్లెటిక్స్‌లో పతకాలు సాధిస్తూ జిల్లాకు గుర్తింపు తెస్తోంది. నామాయి నర్సవ్వ, ముత్యం దంపతుల కుమార్తె అయిన రుచితది మధ్యతరగతి రైతు కుటుంబం. క్రీడల్లో ప్రతిభతో హైదరాబాద్ హకీంపేట క్రీడా పాఠశాలలో సీటు సాధించి, అనంతరం బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందింది. 100 మీటర్ల హర్డిల్స్‌లో రాణిస్తున్న రుచిత 2017లో జాతీయ పోటీల్లో కాంస్యం, 2019లో స్వర్ణం, ఖేలో ఇండియాలో రజతం సాధించింది. 2023లో జాతీయస్థాయి పోటీల్లో రజతం, 2024లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో స్వర్ణం, ఇండియన్ ఓపెన్‌లో కాంస్య పతకం కై వసం చేసుకుంది. పలు జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన ఆమెకు మరింత ప్రోత్సాహం, ఆర్థిక సహకారం అందించాలని కోరుతోంది.
తల్లిదండ్రుల ప్రోత్సాహం.. తాతయ్య మార్గదర్శకత్వంతో బ్యాడ్మింటనన్ శ్రీవల్లి, శ్రీవైభవి సిస్టర్స్ విజయపథంలో దూసుకుపోతున్నారు. తండ్రి అనుముల అమర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, తల్లి లావణ్య లైబ్రేరియనన్. పిల్లల క్రీడా భవిష్య త్తు కోసం తండ్రి అమర్ తన ఉద్యోగాన్ని సైతం వదులు కుని ప్రోత్సహిస్తున్నారు. విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడైన తాతయ్య రాజేశ్వర్ శిక్షణతో శ్రీవల్లి, శ్రీవైభవి బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్నారు. శ్రీవల్లి ప్రస్తుతం డిగ్రీ చదువుతూనే ఆటలో విజయాలు సాధిస్తోంది. 2022లో రాష్ట్ర సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో ప్రస్థానం ప్రారంభించిన శ్రీవల్లి.. మంగళ కప్‌లో కాంస్యం, జూనియర్ పోటీల్లో రజతం సాధించింది. 2023లో సీఎం కప్‌లో వెండితోపాటు జూనియర్ టోర్నీల్లో రెండు స్వర్ణ పతకాలు కై వసం చేసుకుంది. 2025లో ఉగాండలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో మహిళల సింగిల్స్‌లో రజతం, కాంస్య పతకాలు సాధించి సత్తాచాటింది. ఇప్పటివరకు అండర్–11 నుంచి సీనియర్స్ వరకు 50కి పైగా జాతీయ, నాలు గు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. తాజా గా లక్నోలో జరిగిన జాతీ యస్థాయి పోటీల్లోనూ పాల్గొంది. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీవల్లి చెబు తోంది. ఇక 13 ఏళ్లకే బ్యాడ్మింటన్‌లో సత్తా చాటిన శ్రీవైభవి ఇప్పటి వరకు జైపూర్, చండీగఢ్, బిహార్, జమ్మూకశ్మీర్, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన జాతీయస్థాయి టోర్నీల్లో పాల్గొంది. జాతీయ ర్యాంకింగ్స్‌లో అండర్–15 విభాగంలో 42వ స్థానం, అండర్–17లో 45వ ర్యాంకు సాధించడం విశేషం. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అండర్–14 పోటీల్లో ప్రతిభ కనబరిచి, ఈ నెల 25 నుంచి 29 వరకు మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. 2030 యూత్ ఒలింపిక్స్, 2032 ఒలింపిక్స్‌లో దూశానికి ప్రాతినిధ్యమే తన లక్ష్యమని చెబుతోంది.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
పేదరికం ఆమె ప్రతిభకు అడ్డుకాలేదు. కూలీ పనులు చేసుకుంటూ.. జీవనం సాగిస్తున్న తల్లిదండ్రులు.. కూతురికి క్రీడలపై ఉన్న ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించారు. దీంతో జాతీయస్థాయిలో సత్తా చాటుతోంది సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామానికి చెందిన అల్గీత్ వైష్ణవి. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తండ్రి గంగన్న–తల్లి సునీత కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కూతురి క్రీడా భవిష్యత్తు కోసం తమవంతు సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో వైష్ణవి ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఈ ఏడాది మార్చి 24 నుంచి 28 వరకు నిర్వహించిన జాతీయస్థాయి జూనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. కూతురు క్రీడల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు.
శ్రీవైభవి
శ్రీవల్లి
సాఫ్ట్‌బాల్‌లో సత్తా చాటుతున్న దక్షప్రియ..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్‌కు చెందిన ఉదయ్‌కుమార్–స్రవంతి దంపతుల కూతురు దక్షప్రియ సాఫ్ట్‌బాల్ క్రీడలో సత్తా చాటుతోంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు నిర్మల్‌లో నిర్వహించిన జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ పోటీలకు ఎంపికై ంది. పంజాబ్ రాష్ట్రంలోని బటిండాలో ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించిన జాతీయ పోటీల్లోనూ సత్తా చాటింది. దక్షప్రియ తండ్రి ఉపాధ్యాయుడు కాగా, తల్లి అటవీ శాఖలో పనిచేస్తున్నారు.


