నిర్మల్ రూరల్: జవహర్ నవోదయలో ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 8 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,737 మంది విద్యార్థులకు 1,500 మంది హాజరు కాగా, 237 మంది గైర్హాజరయ్యారు. 86 శాతం హాజరు నమోదైంది. పరీక్ష ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించారు. నిమిషం నిబంధన అమలులో ఉండడంతో విద్యార్థులందరినీ గంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ సెంటర్ లెవెల్ అబ్జర్వర్లను నియమించారు.


