పాఠశాలకు దాతల చేయూత | - | Sakshi
Sakshi News home page

పాఠశాలకు దాతల చేయూత

Nov 29 2026 3:05 PM | Updated on Nov 29 2026 3:05 PM

తానూరు: మండలంలోని వడ్‌గాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు గ్రామానికి చెందిన పలువురు దాతలు శనివారం రూ.4 లక్షల విలువైన కంప్యూటర్లు, ప్రింటర్‌, ఫర్నిచర్‌ ఇన్వర్టర్‌, 51 మందికి బ్యాగులు, ష్యూస్‌ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థుల కోసం కంప్యూటర్‌, ఇతర సామగ్రి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. దాతలకు పాఠశాల ఉపాధ్యాయులు, పోషకులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుమన్‌బాయి, నాయకులు గోవింద్‌రావ్‌ పటేల్‌, దాతలు డాక్టర్‌ పండిత్‌, డాక్టర్‌ మాద్నురే సుధాకర్‌, జోగదాండ్‌ లక్ష్మణ్‌, కధం సంతోష్‌, ఉపాధ్యాయులు మహేశ్‌, అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement