లక్ష్మణచాంద: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను ఐఎంటీ హైదరాబాద్ వారు శనివారం సందర్శించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ సుహాబ్ రియాజ్, స్కాలర్ జీవన్ పార్‌పల్లి, బాబాపూర్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. రెండు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు కారణాలు ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామస్తుల సహకారంతోనే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం అమలు తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇందులో సర్పంచులు పుష్ఫ, లక్ష్మీ, ఉప సర్పంచులు విద్యాసాగర్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, కిష్టయ్య పాల్గొన్నారు.


