నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Nov 29 2026 3:05 PM | Updated on Nov 29 2026 3:05 PM

ఆదివారం శ్రీ 29 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

మారుమూల పల్లె నుంచి..

ట్రిపుల్‌ఐటీలో ‘ఎన్‌–జెన్‌ పోస్టాఫీస్‌’

విద్యార్థులకు ఆధునిక తపాలా సేవలను చేరువ చేయడం, ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు పెంపునకు బాసర ట్రిపుల్‌ ఐటీలో ‘ఎన్‌–జెన్‌ పోస్టాఫీస్‌’ శనివారం ప్రారంభమైంది.

క్రీడలు ఆరోగ్యంతోపాటు శారీరక, మానసిక వికాసానికి దోహదం చేస్తాయి. క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే మనోధైర్యాన్ని పెంచుతాయి. జిల్లాకు చెందిన అనేకమంది క్రీడాకారులు తమ సామర్థ్యంతో రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తూ గుర్తింపు పొందుతున్నారు. పరిమిత వసతులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగి పతకాలు సాధిస్తున్నారు. జీల్లా కీర్తిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి వేదికలపై ఎగురవేస్తున్నారు. మెరుగైన మైదానాలు, ఆధునిక పరికరాలు, నాణ్యమైన శిక్షణ, ఆర్థిక సహకారం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తామంటున్నారు. తమ ప్రతిభతో క్రీడల్లో జిల్లా గేమ్‌ ఛేంజర్స్‌గా గుర్తింపు పొందుతున్నారు. కొంత మంది క్రీడాకారులపై ప్రత్యేక కథనం. – నిర్మల్‌టౌన్‌

పెంబి మండలంలోని మారుమూల గ్రామం రాయదారికి చెందిన జాదవ్‌ అంబాజీ–ప్రేమబాయి దంపతుల కుమారుడు వినోద్‌ పట్టుదలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే సాధారణ రైతు కుటుంబానికి చెందిన వినోద్‌కు క్రీడలపై ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించారు. వారి ప్రోత్సాహంతో షూట్‌బాల్‌ నిరంతర సాధన చేసి భారత జట్టులో స్థానం సంపాదించాడు. ఈ నెల 22 నుంచి 26 వరకు నేపాల్‌లో నిర్వహించిన తొలి ఇంటర్నేషనల్‌ షూట్‌బాల్‌ ఎమర్జింగ్‌ కప్‌ పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొన్నాడు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు లక్ష్యసాధనకు అడ్డుకావని నిరూపిస్తూ గ్రామానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు.

వుషూ క్రీడాకారులకు

కలెక్టర్‌ అభినందన

నిర్మల్‌చైన్‌గేట్‌: ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరగనున్న 26వ సబ్‌–జూనియర్‌ నేషనల్‌ వుషూ చాంపియన్‌షిప్‌ పోటీలకు జిల్లా నుంచి ఏడుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించిన వీరిని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా, ముధోల్‌ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ శనివారం అభినందించారు. పతకాలు, ప్రశంసాపత్రాలు అందించి జాతీయస్థాయిలో జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రీడాకారులు సోలంకే సాక్షి, వాగ్మారే కరణ్‌, అబ్దుల్‌ రహ్మాన్‌, శ్రీరాముల ప్రణీల్‌రాజ్‌, మాడేకర్‌ ప్రణీత, అనుష్క, సాయినాథ్‌ కొంకుల్వార్‌, సట్లా హర్షవర్ధిని, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

రైతబిడ్డ వెయిట్‌ లిఫ్టర్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement