నిర్మల్: ‘ప్రజాప్రతినిధులు, అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారు.. ఏళ్లుగా చెరపట్టిన అసైన్డ్ భూములను ఇప్పటికై నా స్వాధీనం చేసుకుంటున్నారు..’ అంటూ జిల్లావాసులు అధికారుల పని తీరుపై అభినందనలు కురిపించారు. కానీ.. రూ.కో ట్ల విలువ చేసే అసైన్డ్‌భూముల ఆక్రమణల లెక్కను మధ్యలోనే ఆపేశారు. దీంతో అప్పుడు మెచ్చుకున్న జిల్లావాసులు ఇప్పుడు ప్రజాప్రతినిధులు, అధికా రుల తీరుపై ప్రశ్నిస్తున్నారు.
‘అసైన్డ్’ పేరిట భూస్వాహా..
జిల్లాకేంద్రంలోని దివ్యనగర్, మల్లన్నగుట్ట ప్రాంతంలో అసైన్డ్ భూములను బడాబాబులు చెరబట్టా రు. ప్రభుత్వ స్థలాలను స్వాహా చేస్తున్నారు. 534 సర్వేనంబర్‌లో 29.03 ఎకరాల్లో అసైన్డ్ పోనూ మిగతా 2.20ఎకరాల ప్రభుత్వభూమిని ఓ పార్టీకి చెంది న బడా నేత కబ్జా పెట్టాడు. తమ భూమితోపాటు సర్కారు జాగాలోనూ అక్రమ నిర్మాణాలు, అడ్డుగ డలు కట్టేశాడు. అక్కడి కుంటనూ క్రమంగా మాయం చేస్తున్నాడు. ప్రభుత్వ స్థలాన్నీ కబ్జా చేయడంపై కొ న్నేళ్లుగా ఫిర్యాదులు, మీడియా కథనాలు వచ్చా యి. అప్పట్లో ఆ ‘బడానేత’ అధికారపార్టీలో ఉండటంతో జిల్లా అధికారులూ ఏం చేయలేకపోయారు.
ఎమ్మెల్యే ఫిర్యాదుతో కదిలి..
గత అక్టోబర్‌లో ఎమ్మెల్యే, బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి 534 సర్వేనంబర్‌లోనే స్వయంగా అప్పటి కలెక్టర్ అభిలాషఅభినవ్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ సమక్షంలోనే ఫిర్యాదు చేయగా రెవెన్యూ, మున్సిప ల్ అధికారులు అదేరోజు బుల్డోజర్ తెప్పించి మల్ల న్నగుట్ట అయ్యప్ప గుడి ఎదురుగా ప్రభుత్వ భూమి లో చేపట్టిన అక్రమ కట్టడాల తొలగింపు చేపట్టారు.
బ్రేక్ ఎందుకు వేసినట్లు..!
ప్రభుత్వ భూములను కబ్జా పెడుతూ ప్రజావసరా లకు కనీసం భూమిలేకుండా చేయడంపై ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి సీరియస్ కావడం, అప్పటి కలెక్టర్ వెంటనే స్పందించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కానీ.. ఆక్రమణల తొలగింపు చేపట్టిన బుల్డోజర్‌కు కొన్నిరోజులకే బ్రేక్ పడింది. కూల్చేసిన ఆక్రమణల చోట యథావిధిగా మళ్లీ అడ్డుగోడలు కట్టేశారు. ఈ కూల్చివేతలను ఆపిందెవరూ..! బుల్డోజర్‌ను అడ్డుకున్నదెవరూ..? అన్న ప్రశ్నలు అప్పట్లోనే వచ్చాయి. అప్పుడు మున్సిపల్ ఎన్నికల పనులు ఉండటంతో జిల్లా అధికారులతో పాటు సదరు ప్రజాప్రతినిధులూ అందులో బిజీగా మారారు. ఎన్నికల తర్వాతైనా రెవెన్యూ అధికారులు చర్యలు చేపడతారేమోనని అంతా ఎదురుచూశారు. కానీ.. అప్పటి కలెక్టర్ బదిలీకావడం, ప్రజాప్రతినిధులూ మళ్లీ ఈ విషయాన్ని లేవనెత్తకపోవడంతో కబ్జాల తొలగింపులో కదలిక లేకుండాపోయింది.
రూ.కోట్ల భూములు కొల్లగొడుతూ..
జిల్లాకేంద్రమైన తర్వాత నిర్మల్‌లో భూముల విలు వ ఆకాశాన్నంటుతోంది. ఎకరం రూ.కోట్లలో పలు కుతోంది. ఇక ఏఎన్‌రెడ్డి కాలనీ, దత్తాత్రేయనగర్, దివ్యనగర్ లాంటి ప్రైమ్ లొకేషన్‌లలో ప్లాట్ ధర రూ.60లక్షల వరకు ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ విలువైన ఏరియాలోని 534 సర్వేనంబర్‌లోగల ప్రభుత్వ భూములను బడా నేతలు కబ్జాపెడుతున్నారు. అయ్యప్ప టెంపుల్ (మల్లన్నగుట్ట) ఏరియాలోని 534, 535 తదితర సర్వేనంబర్లలో అసైన్డ్ భూ ముల్లోనే ఇష్టారీతిన వెంచర్లు ఏర్పాటు చేశారు. ము న్సిపల్ టౌన్‌ప్లానింగ్‌లో ఉన్న రోడ్లనూ మాయంచే సి, ప్లాట్లు అమ్మేశారు. ఇక్కడ అసైన్డ్ భూములు బ డాబాబులకు ఎలా కేటాయించారు? వాటిల్లో నిర్మాణాలు, వెంచర్లకు అనుమతులు ఎలా ఇచ్చారు? అక్కడ ప్రభుత్వ భూమి ఎంత ఉంది? అన్న వివరా ల కోసం కొందరు ఆర్టీఐలు పెట్టినా అధికారులు స్పష్టమైన వివరాలు ఇవ్వకపోవడం అనుమానాల కు తావిస్తోంది. ఇప్పటికై నా అసైన్డ్ పేరిట చేస్తున్న భూకబ్జాలపై ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.
వేరే శాఖలకు కేటాయించాం
జిల్లాకేంద్రంలోని 534 సర్వేనంబర్‌లో అసైన్డ్ పోనూ మిగతా ప్రభుత్వ భూమిని గుర్తించాం. గతంలో తీసుకున్న నిర్ణయాలు, ఉన్నతాధికారుల సూచన మేరకు సదరు భూమిని ఇతర శాఖలకు కేటాయించనున్నారు.
– రాజు, తహసీల్దార్, నిర్మల్ అర్బన్


