నిర్మల్‌చైన్‌గేట్: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్ర భుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. దివ్యాంగుల కోసం ప్ర భుత్వం ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. 11వేల దివ్యాంగ పొ దుపు సంఘాల్లో దాదాపు 80వేల మంది దివ్యాంగులు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఆరేళ్లలో పు దివ్యాంగుల ఆరోగ్యం మెరుగు కోసం బాల భ రోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కలెక్ట ర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం స్కూటీలు, అడ్వాన్స్‌డ్ చక్రాల కుర్చీలు, ల్యాప్‌టాప్ లు, స్మార్ట్ ఫోన్లు, వినికిడి యంత్రాలు తదితర పరి కరాలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందని తెలిపారు. అనంతరం కలెక్టర్ ప్రాంగణంలో కార్పొరేషన్ చైర్మన్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి 38మంది దివ్యాంగులకు ప్రత్యేక స్కూటీలు అందజేశారు. మహిళాశిశు, దివ్యాంగుల సంక్షేమాధికారి వినూత్న, అధికారులు పాల్గొన్నారు.


