కుంటాల: వర్షాలు పడకముందే కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా తరలించాలని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్ సూచించారు. శుక్రవారం మండలంలోని ఓల, అంబకంటి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు తెలిపారు. కుంటాలలో లారీలు రాక ఇబ్బంది పడుతున్నామని రైతులు తెలుపగా సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి లారీలు సమకూర్చారు. సివిల్ సప్లయ్ డీఎం సుధాకర్, తహసీల్దార్ కమల్‌సింగ్, డీటీ కార్తిక్‌రెడ్డి ఉన్నారు.
నర్సాపూర్ (జి): రెండ్రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్ నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని గొల్లమాడలో డీసీఎంఎస్, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మా ట్లాడారు. ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులు ఆందోళన చెందవద్దని కొనుగోళ్లు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. సివిల్ సప్లయ్ డీఎం సుధాకర్, తహసీల్దార్ శ్రీకాంత్, సెంటర్ నిర్వాహకులు భూమయ్య, శ్రీను ఉన్నారు.


