అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

నిర్మల్‌చైన్‌గేట్‌: అధికారుల వేధింపులతోనే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని గిరిజన సంక్షేమ శా ఖలో పని చేసే అవుట్‌ సోర్సింగ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ వాడ్య శ్రీధర్‌బాబు ఆత్మహత్య చేసుకున్నాడని జిల్లా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జే ఏసీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం న ల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై కలెక్టరేట్‌లో ని రసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాహుల్‌ రాజ్‌, వినోద్‌కుమార్‌ మాట్లాడారు. ప్రభుత్వం తక్షణ మే స్పందించి ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి వాస్తవాలను వెలికితీయాలని కో రారు. మృతుడి కుటుంబానికి రూ.10లక్షల ఎ క్స్‌గ్రేషియా, కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల సమస్యల తక్షణ పరిష్కారానికి జి ల్లా స్థాయిలో ఒక ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement