సారంగపూర్: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జౌళి గ్రామంలో శుక్రవారం రూ.9లక్షలు ఈజీఎస్ నిధులతో చేపట్టిన పాఠశాల ప్రహరీ, రూ.10లక్షలతో చేపట్టిన ఐకేపీ వర్క్‌షెడ్ నిర్మాణాని కి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల సమగ్రాభివృద్ధి బీజేపీతో నే సాధ్యమవుతుందని తెలిపారు. సర్పంచ్ సురేందర్, బీజేపీ మండలాధ్యక్షుడు కాల్వ నరేశ్, ఆయా గ్రామాల సర్పంచులు గంగారెడ్డి, సాహెబ్‌రావు, నాయకులు తిరుమలాచారి, విలాస్, పీఆర్ డీఈఈ తుక్కారాం, ఎంఈవో మహేందర్ ఉన్నారు.


