వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

వాతావరణం ● 356 మందిలో 192 మందికే.. ● నిలిచిన రూ.20కోట్ల రాయితీ ● ఏళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపు 9లోu

ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముంది.

టీ–ప్రైడ్‌.. సబ్సిడీకి బ్రేక్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు స్వ యం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం ప్రవేశపె ట్టిన టీ–ప్రైడ్‌ పథకం దరఖాస్తుదారులకు నిరా శే మిగిలింది. జిల్లాలో 356మంది దరఖాస్తు చే సుకోగా 192మందికి సబ్సిడీ వచ్చింది. మిగతా వారు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకునే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2016లో టీ–ప్రైడ్‌ (తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రాం ఫర్‌ ర్యాపిడ్‌ ఇంక్యూబేషన్‌ దళిత్‌ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ ఇన్సెంటివ్‌ స్కీం) పథకాన్ని ప్రారంభించింది. చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా వాహనాలు కొనుగోలు చేసి ఉపాధి కల్పించేలా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం ఈ పథకాన్ని రూపొందించారు. 2026 వరకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. జిల్లాకు సంబంధించి కొందరికే సబ్సిడీని మంజూరు చేసింది. ఆ తర్వాత ఈ పథకంలో పురోగతి కరువైంది. వందల సంఖ్యలో లబ్ధిదారులు సబ్సిడీ అందక నిరాశలో ఉన్నారు. వాహనాలు ఓ వైపు పాతబ డిపోతుండగా గిరాకీలు లేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సి న డబ్బులు రాక ఆర్థికంగా నలిగిపోతున్నారు.

పలు రకాలుగా సబ్సిడీ

టీ–ప్రైడ్‌ పథకం 2016లో ప్రారంభమైంది. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 35నుంచి 45శా తం సబ్సిడీపై కార్లు, ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, పొక్లెయినర్లు, టిప్పర్లు, ఇతర వ్యవసాయ, వ్యాపార రంగాలకు సంబంధించిన వాహనాలు కొనుగోలు చేసి తద్వారా ఉపాధి పొందేలా అవకాశం కల్పించారు. లబ్ధిదారుడి వాటా, బ్యాంక్‌ రుణం ద్వారా వాహనాలు కొనుగోలు చేశాక ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేస్తుంది. రూ.5కోట్లలోపు ఏదైనా యూనిట్‌ను ఎంచుకోవచ్చు. కానీ, సబ్సిడీ మాత్రం గరిష్టంగా రూ.75లక్షలే వస్తుంది. వస్తువుల తయారీ పరిశ్రమలు, ట్రాన్స్‌పోర్టు వాహనాల కొనుగోలు కేటగిరీల్లో మహిళలకు 45శాతం, పురుషులకు 35శాతం సబ్సిడీ అందిస్తుంది.

పెండింగ్‌లో రూ.20 కోట్లు

2016 నుంచి 2025 వరకు జిల్లాలో 356 మంది వివిధ కేటగిరీల్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరి లో 192 మందికే ప్రభుత్వం నుంచి సబ్సిడీ మంజూరైంది. మరో 164 మందికి ఎదురుచూపులే మిగిలాయి. జిల్లాకు ఇంకా రూ.20 కోట్ల స బ్సిడీ రావాల్సి ఉంది. 2020 జూలై నుంచి ఎస్టీలు, 2021 మార్చి నుంచి ఎస్సీలకు సబ్సిడీ మంజూరు కావడం లేదు. సబ్సిడీ మంజూరు ఇచ్చిన వారికీ నిధులు జమ చేయడం లేదు. దీంతో దరఖాస్తుదారులు నిత్యం కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యాపారాలు ఆ శించినంతగా లేక, తీసుకున్న రుణాలకు వాయిదాలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాయిదాలు ఆలస్యమైతే రుణాలిచ్చిన కంపెనీలు వాహనాలను జప్తు చేస్తున్నాయని, ఇంట్లో దాచుకున్న బంగారం అమ్మి వాయిదాలు కడుతున్నామని వాపోయారు.

రూ.8.32 లక్షల సబ్సిడీ రావాలి

టీ–ప్రైడ్‌ పథకంలో సబ్సిడీ వస్తుందంటే ఆరేళ్ల క్రితం ధైర్యం చేసి హార్వెస్టర్‌ కొనుగోలు చేశాం. కానీ, ఇప్పటివరకు రూపాయి సబ్సిడీ కూడా రాలేదు. బ్యాంక్‌ రుణం మొత్తం మేమే చెల్లించాం. సబ్సిడీ డబ్బులు రూ.8.32 లక్షలు రావాల్సి ఉంది. వెంటనే సబ్సిడీ అందించాలి.

– భూక్య స్వరూప, లక్ష్మీసాగర్‌

రాయితీ సొమ్ము అందజేయాలి

45శాతం సబ్సిడీ వస్తుందంటే ఐదేళ్ల కింద ట్రాక్టర్‌ కొన్నాం. ప్రతినెలా వాయిదాలు కడుతున్నాం. సబ్సిడీ రూ.2.95 లక్షలు ఇప్పటికీ రాలేదు. గిరాకీలు సరిగా లేని సమయాల్లో వాయిదాలు చెల్లించడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. రాయితీ సొమ్ము మంజూరు చేయాలి.

– జాడి ఐలా, మద్దిపడగ, కడెం

అందాల్సిన సబ్సిడీ కేటగిరీల వారీగా..

జనరల్‌ కేటగిరి

ఇన్సెంటివ్‌ సబ్సిడీ రూ.35,03,235

పావలా వడ్డీ రూ.2,47,52,395

ఎస్సీ కేటగిరి

ఇన్సెంటివ్‌ సబ్సిడీ రూ.7,61,41,392

ఎస్టీ కేటగిరి

ఇన్సెంటివ్‌ సబ్సిడీ రూ.11,19,14,150

పావలా వడ్డీ రూ.15,15,624

పీహెచ్‌సీ కేటగిరి

ఇన్సెంటివ్‌ సబ్సిడీ రూ.1,62,51,574

పావలా వడ్డీ రూ.14,84,932

Advertisement
 
Advertisement
Advertisement