నిర్మల్: సారంగపూర్ మండలంలో ని అడెల్లి అటవీ ప్రాంతంలో కొ లువుదీరిన మహాపోచమ్మకు ఏడాదికేడాది భక్తులు పెరుగుతూనే ఉన్నారు. అమ్మవారి ని దర్శించుకునేందుకు ఉత్త ర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని సరిహద్దు జి ల్లాల భక్తులు అధికసంఖ్యలో వస్తున్నారు. వేలాదిమందితో కిక్కిరిసిపోయే అడెల్లి ప్రతీ ఆదివారం ‘మినీ మేడారాన్ని’ తలపిస్తోంది.
చల్లని చూపులతోనే దీవెనలు
ఈప్రాంత ప్రజల ఇలవేల్పుగా, లక్షలాది మంది భక్తుల ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్న అడెల్లి పోచమ్మ తల్లి తన చల్లని చూపులతోనే దీవిస్తుంది. గతేడాది నవంబర్ 7న అంగరంగ వైభవంగా అమ్మవారు కొత్త ఆల యంలో కొలువుదీరారు. గర్భగుడిలో పోచమ్మతో పాటు తన అక్కాచెల్లెళ్లుగా భావించే బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణ వి, వారాహి, ఇంద్రాణి, చా ముండి విగ్రహాలున్నాయి. ఎక్క డా లేనివిధంగా ఇక్కడి మహా పోచమ్మ ఆలయంలో ఈ సప్తమాత్రికలు ఉండటం అడెల్లికి మరింత విశిష్టతను తీసుకొచ్చింది.
పార్కింగ్ పేరిట పైసా వసూల్!
అడెల్లి ఆలయానికి కార్లు, జీపులు, బస్సుల్లో వెళ్తే రూ.50 చెల్లించాల్సిందే. ఇదేంటీ అంటే.. ‘పార్కింగ్ ఫీజు’ అంటున్నారు. రోడ్డుపై అడ్డుపడి మరీ.. వసూలు చేస్తున్నారు. సరే.. అని డబ్బులు చెల్లించి గుడి దగ్గరికి వెళ్తే.. ఎక్కడా పార్కింగ్ ప్లేస్ అని ప్రత్యేకంగా లేదు. గుడి ఎదుట, రోడ్డుపైన, వంటలు చేసుకునే దగ్గర ఇలా.. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపాల్సి వస్తోంది. ఆదివారం వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది.
అడెల్లిలో మొక్కు తీర్చుకునే చోట ముక్కు మూసుకోవాల్సిందే. ఆలయానికి ఎదురుగా ఈశాన్య భాగంలో అమ్మవారికి మేకలు, కోళ్లు బలిచ్చే (స్లాటర్ ఏరియా) చోటుంది. ఇక్కడ ఎలాంటి సిమెంట్ ప్లాట్‌ఫాం లేదు. కనీసం గద్దెలూ నిర్మించలేదు. ఆకులతో వేసిన గుడిసెల కింద అపరిశుభ్రంగా ఉంది. వర్షాల సీజన్‌లో మరీ దారుణం. బురద, ఈగలతో భక్తులకు పరీక్షగా మారుతోంది.


