‘అల్లంపల్లివాసుల సమస్యలు పరిష్కరిస్తాం’ | - | Sakshi
Sakshi News home page

‘అల్లంపల్లివాసుల సమస్యలు పరిష్కరిస్తాం’

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

కడెం: మండలంలోని మారుమూల అల్లంపల్లి వా సుల సమస్యలు పరిష్కారిస్తామని ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్‌ పేర్కొన్నారు. ఈనెల 4న అల్లంపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే అక్కడి సమస్యల పరిష్కారానికి గ్రామస్తులతో కలిసి శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. అల్లంపల్లి రోడ్డు, ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్‌ సదుపాయం, పాఠశాల, అంతర్గతరోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి అ టవీశాఖ ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శా శ్వత పరిష్కారం చూపిస్తామని అధికారులు వెల్ల డించారు. 10 నెలల్లో రోడ్డు పనులు ప్రారంభించడ మే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే బొజ్జు, కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా, జిల్లా అటవీ అధికారి సుశాంత్‌ సుఖ్‌దేవ్‌ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మండలంలోని గంగాపూర్‌లో రూ.5లక్షలతో బ్రిడ్జి నిర్మాణానికి, పెంబి మండలంలో మూడు ఐరన్‌ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు, గుమ్మెన ఎంగ్లాపూర్‌లో మొబైల్‌ టవర్‌ ఏర్పాటు, డీజీపీఎస్‌ సర్వే చేసి 20 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్న వారికి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. ఎమ్మెల్యే నిధులతో నవాబ్‌పేట్‌ నుంచి గంగాపూర్‌ వరకు గ్రావెల్‌ రోడ్డు మంజూరు చేసేందుకు హామీ ఇచ్చారు. నోటిఫైడ్‌ గ్రామాల్లో త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరాకు అనుమతి కోసం త్వరలోనే మండలాల్లో పర్యటిస్తామని ఎమ్మెల్యే, కలెక్టర్‌ గ్రామస్తులకు తెలిపారు. ఖానాపూర్‌ ఏఎంసీ చైర్మన్‌ భూషణ్‌, తహసీల్దార్‌ ఖాజామొయినొద్దీన్‌, ఎంపీడీవో అరుణ, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బొడ్డు గంగన్న, పీఆర్‌, విద్యుత్‌ అధికారులు పాల్గొన్నారు.

పేదలకు అండగా ప్రజాప్రభుత్వం

పెంబి: పేదలకు అండగా ప్రజాప్రభుత్వం ఉంటుందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారుల కు చెక్కులు పంపిణీ చేశారు. పర్యావరణ దినోత్స వం సందర్భంగా ఎంపీడీవో కార్యాలయ ఆవరణ లో మొక్కలు నాటారు. కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు గుడిసె రమేశ్‌, డీసీసీ కార్యదర్శి స్వప్నీల్‌రెడ్డి, తహసీల్దార్‌ లక్ష్మణ్‌, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, సర్పంచులు సత్యనారాయణస్వామి, భీంరావు, నాయకులు రాజన్న, మహేందర్‌, పెద్దయ్య తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement