నిర్మల్‌చైన్‌గేట్: బ్యాంకులు వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం 2025–26 ఆర్థికసంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించిన డీసీసీ, డీఎల్‌ఆర్సీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. సైబర్ నేరా లపై అప్రమత్తత, పొదుపు, బ్యాంకింగ్‌పై అవగాహ న కలిగేలా విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వెనుకబడిన తరగతుల ప్రజలు, మ హిళా స్వయం సహాయక సంఘాలు, రైతులు, వీధి వ్యాపారులు, విద్యార్థులకు అందించే రుణాల మంజూరులో జాప్యం చేయొద్దని సూచించారు. అనంతరం 2026–27 వార్షిక రుణ ప్రణాళిక నివేదిక ఆవి ష్కరించారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్‌గో పాల్, ఎస్బీఐ, టీజీబీ రీజినల్ మేనేజర్లు రంజన్‌కుమార్, నవీన్‌కుమార్, ఆర్బీఐ లింక్ బ్యాంకింగ్ ఆఫీ సర్ రాములు, అధికారులు, బ్యాంకర్లున్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలి
మామడ: పర్యావరణాన్ని పరిరక్షించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా మండలంలోని ఆరేపల్లి గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని సూచించారు. రైతులు పంట వ్యర్థాలను కా ల్చి పర్యావరణానికి హాని కలిగించొద్దని తెలిపారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సూచించారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ అనేది ఇంటి నుంచే ప్రారంభించాలని సూచించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు. కళాజా త బృందాలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, సీనియర్ సివిల్ జడ్జి రవీందర్, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఎఫ్‌డీవో నాగినిభాను తదితరులు పాల్గొన్నారు.


