బాసర: బాసర ఆర్జీయూకేటీలో విద్యా వారోత్సవా ల్లో భాగంగా మూడో రోజు బుధవారం వివిధ కా ర్యక్రమాలు నిర్వహించారు. వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఈ.గోవర్ధన్ క్యాంపస్‌లోని సివిల్, కెమికల్, మెటలర్జీ, ఈఈఈ, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలను సందర్శించారు. ప్రయోగశాలలు, విద్యార్థుల పరిశోధనలను పరిశీలించి, ఇంగ్లిష్, తెలుగు, మేనేజ్‌మెంట్ విభాగాల్లో బోధనా పద్ధతులపై చర్చించారు. విద్యార్థుల భవిష్యత్తుకు మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు.
సిబ్బంది క్రీడా పోటీలు..
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. పురుషులకు క్రికెట్, వాలీబాల్, మహిళలకు బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. వీసీ పోటీలను ప్రారంభించారు.


