అన్నదాత మురిసె | - | Sakshi
Sakshi News home page

అన్నదాత మురిసె

May 14 2026 6:39 AM | Updated on May 14 2026 6:39 AM

● ఖరీఫ్‌ పంటల ఎంఎస్‌పీ పెంచిన కేంద్రం ● పెరగనున్న జిల్లా రైతుల ఆదాయం గురువారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

నిర్మల్‌
బాసర లడ్డూ ప్రియం
బాసర క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రసాదం ధరలు పెరిగాయి. 500 గ్రాముల లడ్డూ ధరను రూ.50 పెంచారు. బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి.

మద్దతు

పెరిగె..

మక్కలు కొనాలని ఆందోళన

ఖానాపూర్‌: పట్టణంలోని వ్యవసాయమార్కెట్‌ యార్డులో ఖానాపూర్‌ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచుల కొరత పేరుతో కొనుగోళ్లు నిలిపివేశారని రైతులు ఆందోళన చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ స్థానిక మార్కెట్‌ యార్డ్‌ సమీపంలోని ఖానాపూర్‌–తర్లపాడ్‌ ప్రధాన రహదారిపై బుధవారం బైఠాయించారు. ఇప్పటికే తూకం వేసిన బస్తాలను కూడా లారీల కొరత పేరుతో తరలించడం లేదని రైతులు తెలిపారు. క్వింటాల్‌కు రూ.50తోపాటు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నిరసనలో రైతులు చంద్రకళ, శారద, చిన్నయ్య, నర్సయ్య, శేఖర్‌, మహేష్‌, పరమేష్‌, విలాస్‌, అనిల్‌, సురేష్‌, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఈ విషయమై పీఏసీఎస్‌ అధికారులు, సిబ్బంది స్పందిస్తూ బస్తాలకు అదనపు డబ్బులు తాము తీసుకోవడం లేదని, లారీల అన్‌లోడింగ్‌ సమయంలో డ్రైవర్లు, ఇతరులు వసూలు చేస్తున్నారని వివరణ ఇచ్చారు.

లక్ష్మణచాంద: పగలనక, రాత్రనక ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తరుణంలో అన్నదాతల ఆదాయం పెంచి పంటల ఉత్పత్తులను మరింత ప్రోత్సహించేందుకు కేంద్రం తీపికబురు చెప్పింది. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు సాగుచేసే పలు రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినేట్‌ ఖరీఫ్‌ పంటలకు మద్ధతు ధర పెంచాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది రైతుల ఆదాయాన్ని బలోపేతం చేసి, ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

మద్దతు ధరల పెంపు ఇలా..

గతంతో పోల్చితే ఈసారి కొన్ని పంటలకు మద్దతు ధర పెరిగింది. ఇందులో ప్రధానంగా సన్‌ ప్లవర్‌కు గతంలో క్వింటాల్‌కు రూ.7,721 ఉండగా, ఈసారి 622 రూపాయలు పెంచాలని నిర్ణయించింది. దీంతో క్వింటాల్‌ ధర రూ.8,343లకు చేరింది. నువ్వులు గతంలో క్వింటాలుకు రూ.9,846 ఉండగా ప్రస్తుతం రూ.500 పెరగడంతో క్వింటాలు ధర రూ.10,346 అయ్యింది. పత్తి మధ్యస్థ రకం రూ.7,710 ఉండగా ప్రస్తుతం రూ.557 పెంచింది. దీంతో క్వింటాల్‌ ధర రూ.8,267కు పెంచింది. పత్తి పొడవు రకం గతంలో క్వింటాల్‌కు రూ.8,110 ఉండగా రూ.557 పెంచడంతో రూ.8,667 అయ్యింది. ఆహార పంటల్లో కందులకు గరిష్టంగా రూ.250 పెంచింది. సజ్జలకు కనిష్టంగా రూ.50 పెంచింది. వాణిజ్య పంటల్లో పొద్దు తిరుగుడుకు గరిష్టంగా రూ.622, కనిష్టంగా సోయాబీన్‌కు రూ.172 పెంచింది.

జిల్లాలో 1.20 లక్షల

మంది రైతులకు లబ్ధి..

జిల్లాలో మొత్తం 1.20 లక్షల మంది రైతులు 4.20 లక్షల ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. గత వానాకాలంలో పత్తి 1.50 లక్షల ఎకరాల్లో, సోయాబీన్‌ 1.10 లక్షల ఎకరాల్లో, వరి 1.20 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 30 వేల ఎకరాలలో, కంది 7 వేల ఎకరాల్లో ఇతర పంటలు 3 ఎకరాల్లో సాగు చేశారు. కేంద్రం పంటల మద్దతు ధర పెంచడంతో జిల్లాలో 1.20 లక్షల రైతులకు మేలు చేకూరనుంది. కేంద్రం నిర్ణయం రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఖరీఫ్‌ పంటల సాగు విస్తరిస్తుంది.

సంతోషంగా ఉంది

కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర పెంచడం సంతోషంగా ఉంది. గతంలో సరైనా మద్దతు ధరలు లేక నష్టపోయాం. కేంద్రం మద్దతు ధరలను పెచడంతో రైతులకు మేలు చేకూరుతుంది.

– నర్సారెడ్డి, రైతు లక్ష్మణచాంద

రైతులకు లబ్ధి

జిల్లాలో 4.20 లక్షల ఎకరాలలో వివిధ పంటలను 1.20 లక్షల రైతులు సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్ధతు ధరలను పెంచడంతో జిల్లాలోని 1.20 లక్షల రైతులకు మేలు కలుగుతుంది.

– అంజిప్రసాద్‌, డీఏవో, నిర్మల్‌

మద్దతు ధరల సమాచారం (రూ.లలో..)

పంటల రకం 2025–26 2026–27 పెరిగిన ధర

ఆహార పంటలు..

సాధారణ వరి 2,369 2,441 72

ఏ గ్రేడ్‌ వరి 2,389 2461 72

హైబ్రిడ్‌ జొన్నలు 3,699 3,769 70

సజ్జలు 2,775 2,825 50

రాగులు 4,886 5,000 114

మొక్కజొన్న 2,400 2,475 75

కందులు 8,000 8,250 250

పెసలు 8,768 8,950 182

మినుములు 7,800 8,000 200

వాణిజ్య పంటలు..

వేరుశనగ 7,263 7,500 237

సోయాబీన్‌ 5,328 5,500 172

నువ్వులు 9,846 10,346 500

పొద్దు తిరుగుడు 7,721 8,343 622

పత్తి మధ్యస్థ 7,710 8,267 557

పత్తి పొడవు పింజ 8,110 8,667 557

Advertisement
 
Advertisement
Advertisement