నిర్మల్ రూరల్/నిర్మల్‌చైన్‌గేట్: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, జిల్లాలోని దివ్యాంగులకు అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి భరోసానిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బుధవారం ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం సమగ్ర శిక్ష, ఆలింకో సంస్థ ద్వారా ఈ పరికరాలను పంపిణీ చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ట్రై సైకిల్, సీపీచైర్, వీల్‌చైర్, క్రచెస్, హియరింగ్ ఎయిడ్, బ్రెయిలీ కిట్, బ్రెయిలీ స్లేట్, టీఎల్‌ఎం కిట్లు 189 మంది విద్యార్థులకు అందించారు. డీఈవో భోజన్న మాట్లాడుతూ ఇలాంటి ఉపకరణాలు విద్యార్థుల స్వతంత్ర జీవనానికి విద్యాభ్యాసానికి దోహదపడతాయన్నారు. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన నిర్ధారణ శిబిరానికి హాజరైన 205 మంది దివ్యాంగ విద్యార్థుల్లో 189 మంది అర్హులుగా నిర్ధారించి వారికి 296 ఉపకరణాలు అందజేశామన్నారు. ఇందులో యోగేష్, ప్రతాప్, మహేందర్, కుందన్, సమగ్ర శిక్ష విలీన విద్య సమన్వయకర్త ప్రవీణ్ కుమార్, స్థానిక కౌన్సిలర్ గంజి రాజు, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, నారాయణ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు జింక సూరి, శ్రీరామోజీ నరేష్, అర్జున్, శశాంక్, సాత్విక్ పాల్గొన్నారు.


