నిర్మల్ రూరల్: ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. బుధవారం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉద యం 9 నుంచి 12 గంటల వరకు, సెకండియ ర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 1,435 మంది విద్యార్థులకు 1,359 మంది హాజరయ్యారు. 76 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కేటగి రీలో 131 మంది విద్యార్థులకు 118 మంది హాజరవగా, 13 మంది గైర్ హాజరయ్యారు. సెకండియర్‌లో మొత్తం 345 మంది విద్యార్థులకు 324 మంది హాజరవగా.. 21 మంది గైర్ హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 23 మంది విద్యార్థులకు 18 మంది హాజరయ్యారని డీఐఈవో పరుశురాం తెలిపారు.
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఐఈవో
కుంటాల: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో కొనసాగుతున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాన్ని డీఐఈవో పరశురాం బుధవారం పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. 169 విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 12 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఆయన వెంట సీఎస్ ఎత్రాజ్ రాజు, డీవో నర్సయ్య ఉన్నారు.


