జిల్లా కవులకు సత్కారం | - | Sakshi
Sakshi News home page

జిల్లా కవులకు సత్కారం

May 13 2026 1:56 AM | Updated on May 13 2026 1:56 AM

నిర్మల్‌ఖిల్లా: భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రభుత్వం కవి సమ్మేళ నం నిర్వహించింది. తెలంగాణ రచయితల వే దిక జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల హన్మంతు, కవియా త్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కారం శంకర్‌, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, కవి, రచయిత మడిపల్లి రాజ్‌కుమార్‌ కవితాగానంతో ఆకట్టుకున్నారు. పర్యాటక, సాంస్కృతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏపూరి నర్సింహ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి వీరిని శాలువాలతో సత్కరించి ప్ర శంసాపత్రాలు అందజేశారు. వీరికి జిల్లాకు చెందిన సాహితీవేత్తలు శివప్రసాద్‌, జగదీశ్వర్‌, భీమేశ్‌ తదితరులు అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement